బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం

బ్లాగ్ వేదిక బ్లాగర్:బొడ్డు మహేందర్ గారి పరిచయం.

మన బ్లాగ్ వేదిక మెంబర్:బ్లాగర్ బొడ్డు మహేందర్ గారు సాధించిన విజయాలు అమోఘం.సంగీతం,రచనల పట్ల ఆయనకున్న అభిమానం అంత ఇంతా కాదు.దాని పట్ల ఆయనకున్న పట్టుదల,కృషే ఆయనను ఈ స్థాయిలొ ఉంచాయి.ఆయన గురించి ఆయన మాట్లల్లోనే చూడండి.బ్లాగ్ వేదిక ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ...మరిన్ని విజయాలు సాధించాలని,చేధించాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది.

బ్లాగ్ వేదిక బ్లాగర్:బొడ్డు మహేందర్ గారి పరిచయం.

నా పేరు మహేందర్. ఇంటి పేరు బొడ్డు.
నేను ఆదిలాబాద్ జిల్లాలోని  చెన్నూర్ పట్టణంలోని కుమ్మరిబొగుడ ప్రాంతం లో పుట్టాను..
నా తల్లి దండ్రులు : బొడ్డు ఆగయ్య - కమల.
వారికి నేను మొదటి సంతానం..నాకు ఇద్దరు తమ్ముళ్ళు.
వారి పేర్లు: రవీందర్ ,సురేందర్ ..

ఇక నా గురించి అయితే...
నేను ఐదవ తరగతి వరకు సాందీపని పబ్లిక్ స్కూల్ , శ్రీరాంపూర్ లో , ఆ తర్వాత చెన్నూర్ లోనే ఆరవ తరగతి నుండి పదవతరగతి వరకు సాయి మమత హై స్కూల్ లో, ఇంటర్మీడియట్  చిన్న మున్షి జునియర్ కాలేజిలో చదువుకున్నాను..B.Edని హైదరాబాద్ లో IASE ,Masabtank కాలేజీ లో చేసాను..తెలుగు యూనివర్సిటీ లో MA -తెలుగు , మరియు MCJ -జర్నలిజం చేసాను. PGDBM కోర్సుని దూరవిద్యలో చేశాను. అలాగే వెబ్ డిజైనింగ్ కోర్సు నేర్చుకొని సొంతంగా వెబ్ సైట్స్ రూపొందిస్తున్నాను.
B.Ed -2006 ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 142వ ర్యాంకు సాధించాను.LAWCET-2014 ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 158వ ర్యాంకు సాధించాను.
                          
నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం..
నేను ఇప్పటి వరకి దాదాపుగా 700+ కవితలు రాసాను..
మూడు సంవత్సరాల పాటు  నేను సూర్య ఆదివారం సంచికలో ప్రాస -పదనిస అనే పజిల్ కాలమ్ ని నిర్వహించాను ..అలాగే అప్పుడప్పుడు నేను రాసిన పేరడీ పాటలు, కవితలు ,పజిల్స్ కూడా సూర్య,వార్త , ఆంధ్రజ్యోతి అప్పుడప్పుడు ఈనాడు పేపర్లలో వస్తాయి..( 70 కవితలు, 10 పేరడీ పాటలు , 300కు పైగా పజిల్స్ వివిధ దిన, వార,
మాస పత్రికలలో ప్రచురితమైనవి.)వీటన్నింటిని www.boddumahender.com అనే వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది. 

అలాగే బ్లాగింగ్ కూడా చేస్తుంటాను. ఇప్పటి వరకి 30+ బ్లాగ్స్ / వెబ్ సైట్స్ ను రూపొందించి నిర్వహిస్తున్నాను.తెలుగు భాష, సాహిత్యాలపై ఉన్న అభిమానంతో అనేక తెలుగు బ్లాగులు రూపొందించడం జరిగింది.
వీటిలో తెలుగు భాష , సాహిత్యం కు సంబంధించినవి 4 ఉన్నాయి.


http://www.teluguliterature.in/ వెబ్ సైట్ లో
తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రాథమిక విషయాల నుండి విభాగాల వారీగా అనేక తెలుగు PDF పుస్తకాల దాకా సామాజిక, ఆధ్యాత్మిక, సాహిత్య విషయాలను అందుబాటులో పెట్టాను.


http://teluguquotes4u.blogspot.in అనే బ్లాగులో
2500కు పైగా అపురూపమైన ఆణిముత్యాల వంటి తెలుగు సూక్తులని ఒక దగ్గర పొందుపరిచి నెటిజన్లకు అందుబాటులో ఉంచాను. వీటిలో 2000కు పైగా సూక్తులని అందమైన వాల్ పేపర్లు గా రూపొందించాను.

ఫేస్ బుక్ లో  "తెలుగు సూక్తులు " పేరిట ఒక పేజీ సృష్టించి అందులో రోజుకు 5నుండి 10 తెలుగు సూక్తులని వాల్ పేపర్లుగా సృష్టించి అందులో పోస్ట్ చేస్తున్నాను. ఈ పేజీని  (
https://www.facebook.com/BestTeluguQuotations ) 11000+ మందికి  పైగా అనుసరిస్తున్నారు.

సినిమా పాటల పై ఉన్న అభిమానంతో , సినీగేయ రచయిత కావాలన్న తపనతో నేను సేకరించిన 5100కు పైగా పాటలని(తెలుగు మరియు ఇంగ్లీష్ లిపిలో) ఒక బ్లాగ్
(http://telugucinemasongs-lyrics.blogspot.in )లో పొందుపరిచి,   సినీ గేయరచయితలైన చంద్రబోస్, భాస్కరభట్ల రవికుమార్, గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ లచే అభినందనలు పొందాను. ఇంతవరకు ఇంటర్నెట్ లో ఇన్ని తెలుగు సినిమా పాటలున్న బ్లాగ్ /వెబ్ సైట్ లేకపోవడం ఒక విశేషం.

జిల్లాలోనే తొలిసారిగా చెన్నూర్ నియోజక వర్గానికి సంబంధించిన వెబ్ సైట్
www.chennur.in ని రూపొందించడం జరిగింది. ఇందులో చెన్నూర్ నియోజక వర్గానికి సంబంధించిన సమస్త సమాచారంతో పాటు ప్రజలకి నిత్యం ఉపయుక్తమయ్యె వివరాలని పొందుపరచడం జరిగింది. http://www.adilabaddistrict.com/
ఆదిలాబాద్ జిల్లా వెబ్ సైట్ లో దాదాపు 1500 గ్రామాల వివరాలు పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నాను.

ఇవి కాకుండా D.Sc, APPSC వంటి పోటీ పరీక్షలకు ఉపయుక్తమయ్యే బ్లాగులను కూడా నిర్వహిస్తూ అభ్యర్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాను.

ఇక ఇప్పటి వరకు రచయితగా మూడు షార్ట్ ఫిలిం(wake up,lets join hands, tegulu associations) లకు కథ-స్క్రీన్ ప్లే - మాటలు అందించాను. ఇవి హైదరాబాద్ , ఖమ్మం, అమెరికా లలో షూటింగ్ జరుపుకున్నాయి..

స్కూల్, కాలేజీ స్థాయిల్లో వ్యాసరచన, జి.కె క్విజ్ వంటి అంశాల్లో అనేక
బహుమతులు పొందాను.మరియు ఈనాడు, ఉద్యోగసోపానం వంటి పత్రికలు నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాను. 

2011 may లో ఆంద్ర సారస్వత పరిషత్తు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర
టి.వి నాటక రంగ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆద్వర్యంలో చేపట్టిన సినీగీత రచన అధ్యయన శిబిరంలో పాల్గొని అక్కినేని నాగేశ్వర రావు, సి. నారాయణ రెడ్డి వంటి ప్రముఖులచే సన్మానం, ప్రశంసలు పొందాను.
2013 మార్చ్ 21 న తెలుగు రక్షణ వేదిక అధ్వర్యంలో జరిగిన శతకవుల సన్మానం
కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా సన్మానం.
2013 ఏప్రిల్ 20 వ తేదీన చైతన్య భారతి సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో
రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి చేతుల మీదుగా సన్మానం.
2014 ఫిబ్రవరి 21నాడు తెలుగు మాతృభాషా దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సన్మానం. 
2014 ఏప్రిల్ 27వ తేదీన అంపశయ్య నవీన్ మరియు కరీంనగర్ కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు బోవేరా గార్ల చేతుల మీదుగా ఉగాది పురస్కారం. 

అంతర్జాల కవిగా నాకు ఎక్కువ గుర్తింపు ఉంది.
ప్రముఖ కవుల సంకలానాల్లో కుడా అనేకంగా నా రచనలు పొందుపరచబడినవి.నా రచనలు ఎక్కువగా ఫేస్ బుక్ లో విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయి.త్వరలో ఈ రచనలన్నీ పుస్తక రూపం లో ముద్రించబోతున్నాను.
ఇంకా యుట్యూబ్ లో ఫోటోలతో నేను రూపొందించిన అనేక విడియోలు పొందుపరచడం జరిగింది.
నా గూగుల్ ప్రొఫైల్ కి అయితే కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే కోటి 30లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. 

ఇంకా 2011లో లిమ్కా బుక్ లో ఎక్కడానికి శ్రీరామ నవమి సందర్భంగా పోస్టుకార్డు పై పదివేల పదాలతో రామకోటి రచించాను.
నేను అంతర్జాలంలో తెలుగు భాషాభివృద్దికి , సాహిత్య రంగానికి చేస్తున్న
కృషిని గమనించి తెలుగు రక్షణ వేదిక సంస్థ అధ్యక్షుడుపొట్లూరి హరికృష్ణ  ఏకంగా రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించి తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం జరిగింది.
 తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ గా రాష్ట్రంలోని పలువురు కవులకి అనేకమార్లు సన్మానం కూడా చేయడం జరిగింది.అలాగే http://trvadb.blogspot.in/ అనే బ్లాగు లో ఆదిలాబాద్ జిల్లా కవులకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను.  http://telanganaliterature.blogspot.in/ అనే బ్లాగులో తెలంగాణా సాహితీ విశేషాలన్నీ ఒక దగ్గర పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నాను. 

ప్రస్తుతం చెన్నూరు లో తెలంగాణా సాహితీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాను. దీనికోసం ఇప్పటికే తెలంగాణా కవుల నుండి వందలాది పుస్తకాలు సేకరించాను. 

Think Different...Be Creative... MY QUOTE



1 comment

  1. నిజంగా మీ కృషి అభినందనీయం మహేందర్ గారు... తెలుగులో బ్లాగులు బహు స్వల్పంగా ఉన్నాయి... తెలుపవలసిన విజ్ఞానం చాలా ఉంది... ఖచ్చితంగా మీరు మాలాంటి వారికి మార్గదర్శి. కృతజ్ఞతలు

    ReplyDelete

 

Recent Comments

Most Reading